సనత్ నగర్ బస్టాండ్ ఆనుకుని ప్రధాన రహదారిపై ఉన్న మెడికల్ స్టార్ లో తెల్లవారుజామున ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తూ తన దుస్తులు విప్పి దొంగ రెండు గంటల పాటు నగ్నంగానే అందులో ఉన్నాడు. తిరిగి బయటికొస్తూ దుస్తులు వేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన సనత్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది. బాలాజీ ఫార్మాలోకి అర్ధరాత్రి ఓ దొంగ ప్రవేశించాడు. షట్టర్ తాళాలు విరగ్గొట్టి లోపలికి నగ్నంగా ప్రవేశించిన దొంగ రెండు గంటలపాటు లోపలే ఉండి తెల్లవారుజామున బయటపడ్డాడు.
అంతేకాకుండా క్యాష్ కౌంటర్‌లో ఉన్న రెండు లక్షలు నగదు తీసుకుని బయటికొచ్చి తిరిగి దుస్తులు వేసుకుని దర్జా నడుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఉదయాన్నే చోరీ జరిగినట్లు గుర్తించిన దుకాణం నిర్వాహకుడు వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
