NTV Telugu Site icon

Attack on Petrol Bunk: ఇదెక్కడి ఘోరం.. బైక్‌ లో పెట్రోల్‌ పోసి డబ్బులు అడిగినందుకు చంపేశారు

Petroll

Petroll

Attack on Petrol Bunk: సాధారణంగా పెట్రోల్‌ బంక్‌ లకు వెళ్లి పెట్రోల్‌ వేయించుకుని కార్డ్‌ లేదా క్యాష్‌ ఇస్తుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో మన దగ్గరున్న కార్డ్‌, పోన్‌ పే లు పనిచేసేందుకు మోరాయిస్తుంటాయి. సిగ్నన్స్‌ లేకనో మరే ఇతర కారణలే ఉండొచ్చు. అయితే అటువంటి సందర్భాల్లో తప్పకుండా మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనదగ్గర స్వైప్‌ కార్డ్‌, ఫోన్‌ పే లు వున్నయి కదా అని క్యాష్‌ ను మనం పెట్టుకుండా ధైర్యంగా మన వాహనాల్లో పెట్రోల్‌ పోయించుకుంటుంటాము. చివరకు అవి పనిచేయకపోవడంతో లబోదిబో మంటుంటాము. అయితే ఓ బంక్‌ లో బైక్‌ లో పెట్రోల్‌ పోయించుకుని స్వైప్‌ కార్డ్‌ ను డబ్బుల కోసం ఇచ్చాడు.

కానీ స్వైప్‌ మిషన్‌ పనిచేయలేదు. ఇంకోసారి చేయ్‌ అంటూ వాహనదారుడు పెట్రోల్‌ బాయ్‌ ని కోరాడు. స్వైప్‌ మిషన్‌ పనిచేయడంలేదు అన్నాడు బాయ్‌. ఇక చివరకు పెట్రోల్‌ బాయ్‌ డబ్బులు చెల్లించండి అంటూ కోరారు. అయితే వాహనదారుడు తన దగ్గర డబ్బులు లేవని స్వైప్‌ కార్డు మాత్రమే ఉందని గట్టిగా చెప్పాడు. పెట్రోల్‌ పోయించుకుని డబ్బులు కట్టకపోతే ఎలా? అంటూ పెట్రోల్‌ బాయ్‌ వాహనదారునికోరాడు. ఎలాగో అలా డబ్బులు కట్టండి లేదంటే మా ఓనర్‌ మామీద సీరియస్‌ అవుతాడు డబ్బులు కట్టండి స్వైప్‌ మిషన్‌ అయితే పనిచేయడం లేదు అంటూ కోరారు. దీంతో వాహనదారులు ముగ్గురు కలిసి బాయ్‌ పై దాడికి దిగారు. పిడుగుద్దులు కొట్టారు. విచక్షణారహితంగా కొట్టారు. ముగ్గురు కలిసి మూకుమ్ముడిగా దాడి చేయడంతో పాపం ఆబాయ్‌ అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఇదే అలుసుగా భావించిన ముగ్గురు వాహనంలో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన నార్సింగి జన్వాడలో చోటుచేసుకుంది.

Read also:Bandi sanjay: తెలంగాణ భవిష్యత్తును మార్చేందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు

రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలో HP పెట్రోల్ పంపులో పెట్రోల్‌ కోసం ముగ్గురు యువకులు ఒకే బైక్‌ పై వచ్చారు. అక్కడే వున్న బాయ్‌ వచ్చి వారి బైక్‌ లో పెట్రోల్‌ పోసాడు. అయితే ఆయువకుల్లో ఒకడు స్వైప్‌ కార్డు ఇచ్చాడు. అయితే బాయ్‌ స్వైప్ మిషన్ పనిచేయడం లేదు.. డబ్బులివ్వాలని కోరాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముగ్గురు యువకులు పంప్ బాయ్ సంజయ్ పై దాడి చేసారు. పిడు గుద్దుల వర్షం కురిపించారు. బాయ్‌ కిందపడి విలవిల లాడుతున్న పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడే ఉన్న కొందరు బాయ్‌ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. మార్గమద్యలోనే బాయ్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పెట్రోల్‌ పోసి డబ్బులు ఇవ్వమంటే ప్రాణాలే తీసేసారంటూ వాపోయారు. ఇలా అయితే మా పరిస్థితి ఏంటని? పగలు రాత్రి అని తేడాలేకుండా కుటుంబం కోసం కష్టపడుతుంటే మా మీదే ఇలా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తే మా కుటుంబాల పరిస్థితి ఏంటని తోటి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బాయ్‌ పై దాడి చేసిన దృష్యాలు సీసీ టీవీ కెమేరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీని అధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?