NTV Telugu Site icon

Temple Thief: సిద్దిపేట పోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీ పటలగొట్టి..

123

123

Temple Thief: దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి ఆలయంలోనే దొంగలు చోరీకి తెగబడ్డారు. సిద్దిపేట జిల్లాలోని పోచమ్మ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అమ్మవారిని ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Hardik Pandya : నువ్వేమైనా తోపువా?.. కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ ఫ్యాన్స్ ఫైర్

సిద్దిపేట జిల్లాలోని పోచమ్మ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయంలో రోజూ మాదిరిగానే ఆలయ పూజారి అమ్మవారి గుడికి వచ్చాడు. అయితే ఆలయ తలుపులు తెరిచి ఉండటం చూసి షాక్‌ తిన్నాడు. ఆలయంలోని హుండీ చిందర వందరగా పడిఉండటం చూసి ఖంగుతిన్న పూజారి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆలయానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. కాగా.. గతేడాది నుంచి హుండీ తెరవకపోవడంతో అందులో మొత్తం సొత్తంతా ఎత్తికెళ్లినట్లు ఆలయ పూజారి పోలీసులకు తెలిపారు. రోడ్డు పక్కనే వున్న ఆలయంలో చోరీ చేసారంటే ఎవరో పకడ్బందీగా ప్లాన్ వేసుకుని చేసి వుంటారిని, ఇది ఖచ్చితంగా ఊరిలో వున్నవారే అయిఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హుండీ డబ్బులతో ఆలయానికి పునరుద్ధరించుకునేందుకు అనుకుంటున్న సమయంలో ఆలయంలో చోరీ జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.
Hukumpet Tragedy:హుకుంపేటలో విషాదం… గోతిలోపడి బాలుడి మృతి