Rajendranagar ATM: ఈ డ్రైవర్ మామూలోడు కాదు. ఏటీఎంను డబ్బులు జమ చేసేందుకు వచ్చిన సిబ్బందినే బురిడీ కొట్టించి అక్కడ వదిలేసి డబ్బులతో ఉడాయించాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 36 లక్షల వరకు తీసుకుని వ్యాన్ నుంచి బ్యాంక్ సిబ్బంది దిగగానే వ్యాన్ తోనే అక్కడ నుంచి జారుకున్నారు. ముందు జాగ్రత్తగా వ్యాన్ కు సంబంధించిన జీపీఆర్ఎస్ ను సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం విశేషం. అది గమనించలేకపోయారు బ్యాంక్ సిబ్బంది. ఇదే సమయంగా భావించిన డ్రైవర్ డబ్బులతో ఉడాయించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కెనరా బ్యాంక్ ఏటీఎం వద్ద చోటుచేసుకుంది.
Read also: India at UNSC: రష్యాకు షాక్.. ఉక్రెయిన్‌పై తీర్మానానికి భారత్ దూరం..
బ్యాంక్ సిబ్బంది వివరాలప్రచారం.. రోజూలాగే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కెనరా బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు వేసేందుకు వ్యాన్‌తో వచ్చామన్నారు. వ్యాన్ దిగి చూడగానే డ్రైవర్ అప్పటికే డబ్బులతో జారుకున్నాడని తెలిపారు. మేము వెంటపడిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. రూ.36లక్షల వరకు వ్యాన్ లో వున్నాయని తెలిపారు. వ్యాన్ కు సంబంధించిన జీపీఆర్ఎస్ ను సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం మేము గమనించలేకపోయామని తెలిపారు. వ్యాన్ లో సెక్యూరిటీకి సంబంధించిన గన్ ఉన్నట్లు కెనరా బ్యాంక్ సిబ్బంది వెల్లడించారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి రాజేంద్రనగర్ పోలీసులు చేరుకున్నారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Karthika Masam Laxmi Stothras Live: కార్తిక శుక్రవారం.. లక్ష్మీ స్తోత్రాలు వింటే..