Thieves in Kukatpally: హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాళాలు వేసిన ఇంటినే టార్గెట్ చేసి దొరికిన కాటికి దోచుకుపోతున్నారు. దీంతో నగరవాసులు లబోదిబో మంటున్నారు. ఈఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడం సంచలనంగా మారింది.
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడి దొంగల భీభత్సం సృష్టించారు. దయార్ నగర్, దేవీ నగర్ లలో వరుస దోపిడీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్ళనే టార్గెట్ గా పెట్టుకొని చోరీలకు ముఠా పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న 16 ఇళ్ళలో వరుస చోరీకి పాల్పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీస్ నిఘా సరిగ్గా లేకపోవడంతోనే దొంగలు రెచ్చిపోయారు అంటున్నా బాధితులు ఆరోపిస్తున్నారు. తమ కాలనీల్లో పెట్రోలింగ్ పెంచాలంటున్నా స్థానికులు కోరుతున్నారు. రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడింది అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన వాళ్ళేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తుపట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే నగర ప్రజలు అప్పమత్తంగా ఉండాలని ఇంటికి తాళం వేసి వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Read also: Jiyaguda Case Twist: జియాగూడా కేసులో ట్వీస్ట్.. సాయినాధుని చంపింది స్నేహితులే
ఈనెలలో దొంగలు భీభత్సం సృష్టించడం ఇలా మొదటి సారి కాదని ఇలా నగరంలో వేరు వేరు చోట్లు దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క చైన్ స్నాచర్లు, మరోపక్క ఇంటి తాళం వేస్తే చాలు దొంగతనాలు చేస్తూ భాగ్యనగర ప్రజలను హడలెత్తిస్తున్నారు. సీసీ కెమెరాలు వున్నా అవన్నీ పక్కనపెట్టి దొంగలు బీభత్సం సృష్టించడం పోలీసులకు సవాల్ గా మారింది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు. దొంగలను పట్టుకునే పనిలోనే ఇలాంటి దొంగతనాలు ఇంకా జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోడం సరైన పద్దతి కాదుని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు రంగలోకి దిగి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.
KTR: ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానం