Site icon NTV Telugu

తెలంగాణ హోం గార్డులకు న్యూఇయర్‌ కానుక

పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా సేవలందిస్తున్న హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. న్యూఇయర్‌ కానుకగా రాష్ట్రంలో హోంగార్డుల గౌర‌వ వేత‌నాన్ని పెంచనున్నట్టు ప్రకటించింది. హోంగార్డుల‌కు గౌర‌వ వేత‌నం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డుల‌కు పెరిగిన వేత‌నాలు 2021, జూన్ నుంచి అమ‌లు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

https://ntvtelugu.com/kodali-nani-said-that-the-three-capitals-are-for-the-development-of-all-regions/

కాగా ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22 వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు హోం గార్డులు తమ జీతాలను పెంచాలని ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా హోం శాఖలో హోంగార్డులు కీలకంగా వ్యహరిస్తూ విశేష సేవలను అందిస్తున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో వీరి సేవలు పోలీస్ శాఖకు ఎంతో ముఖ్యం. తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పై వారు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ర్ట ప్రభుత్వానికి హోం గార్డులు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version