Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruel Husband: భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే. ఎంత పెద్ద గొడవయినా 10 నిమిషాలు కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు తీరుతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ కొన్ని జంటలు విచక్షణ మరచిపోతారు. రెప్పపాటులో ఏం చేస్తున్నారో అర్థంకాక ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి గొడవలే చిలికి చిలికి గాలివానై ఒకరొనొకరు కొట్టుకోవడం, విడిపోయేంత వరకు దారితీస్తున్నాయి. ఆ కోపంలో ఎదుటి వారిపై దాడులకు దిగుతున్నారు. వనపర్తి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి.. ఆమెపై కోపం పెంచుకుని ఇంటికి నిప్పంటించాడు. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Read also: Bharat Express: సికింద్రాబాద్ వచ్చే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో పొగలు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన చిన్న భద్రయ్య, మణెమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి సంతానం. లక్ష్మిని అదే గ్రామానికి చెందిన శివయ్యకు ఇచ్చి 14 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే గత మూడేళ్లుగా శివయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. లక్ష్మి బట్టలు వేసుకుని అమ్మ ఇంటికి వెళ్ళింది. గత కొంత కాలంగా ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. భార్యను కాపురానికి పంపేందుకు శివయ్య అత్తమామల వద్దకు వచ్చి తరచూ గొడవ పడేవాడు. లక్ష్మి మాత్రం కాపురానికి రానని తేల్చి చెప్పింది. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెపై తమ ప్రేమను చాటుకున్నారు. దీంతో శివయ్యకు అత్తింటిపై కోపం వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శివయ్యపై భార్య లక్ష్మి, అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Kiara Adwani : హాట్ క్లివేజ్ షో తో అదరగొడుతున్న కియారా..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!