NTV Telugu Site icon

Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు

Vanaparthy

Vanaparthy

Cruel Husband: భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే. ఎంత పెద్ద గొడవయినా 10 నిమిషాలు కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు తీరుతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ కొన్ని జంటలు విచక్షణ మరచిపోతారు. రెప్పపాటులో ఏం చేస్తున్నారో అర్థంకాక ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి గొడవలే చిలికి చిలికి గాలివానై ఒకరొనొకరు కొట్టుకోవడం, విడిపోయేంత వరకు దారితీస్తున్నాయి. ఆ కోపంలో ఎదుటి వారిపై దాడులకు దిగుతున్నారు. వనపర్తి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి.. ఆమెపై కోపం పెంచుకుని ఇంటికి నిప్పంటించాడు. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Read also: Bharat Express: సికింద్రాబాద్ వచ్చే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో పొగలు..

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన చిన్న భద్రయ్య, మణెమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి సంతానం. లక్ష్మిని అదే గ్రామానికి చెందిన శివయ్యకు ఇచ్చి 14 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే గత మూడేళ్లుగా శివయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. లక్ష్మి బట్టలు వేసుకుని అమ్మ ఇంటికి వెళ్ళింది. గత కొంత కాలంగా ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. భార్యను కాపురానికి పంపేందుకు శివయ్య అత్తమామల వద్దకు వచ్చి తరచూ గొడవ పడేవాడు. లక్ష్మి మాత్రం కాపురానికి రానని తేల్చి చెప్పింది. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెపై తమ ప్రేమను చాటుకున్నారు. దీంతో శివయ్యకు అత్తింటిపై కోపం వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శివయ్యపై భార్య లక్ష్మి, అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Kiara Adwani : హాట్ క్లివేజ్ షో తో అదరగొడుతున్న కియారా..

Show comments