Munugode Election: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నిక సవాల్‌గా మారడంతో ఎమ్మెల్యే, మంత్రులు సైతం నియోజకవర్గంలోనే తిష్టవేసి ప్రచారం సాగిస్తున్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సైతం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. కాషాయనాథులు సైతం బీజేపీ జెండాను మనుగోడు ఎగురవేసేందుకు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు.
ఈనెల 30న చండూరు మండలం బంగారిగడ్డ వద్ద కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్న్టలు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ నెల 20 తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చౌటుప్పల్, చండూరు పురపాలికలతో పాటూ మునుగోడులో రోడ్‌షోలలో పాల్గొంటారని సమాచారం. ఈ మేరకు పార్టీ క్యాడర్ ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి మునుగోడులోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి అగ్రనేతను రంగంలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులో 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బహిరంగ సభను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై భాజపా కసరత్తు చేస్తోంది.
Read also: Somu Veerraju: రాజధానిపై భావోద్వేగాలు రెచ్చగొడుతున్న టీడీపీ, వైసీపీ
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్:
మోటార్లు కావాలా? మీటర్లు కావాలా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ తెచ్చిపెట్టింది మునుగోడులో బీజేపీ అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని అనుకుటుందని అన్నారు. నాయకులను కొనుగోలు చేయడమే కాదు. కార్లు, మోటార్ సైకిళ్ళు నేతలకు బీజేపీ కొనిస్తదట అంటూ ఆరోపించారు. 200 బ్రిజా కార్లు ,2 వేల మోటార్ సైకిల్ లు కొనడానికి బీజేపీ బుక్ చేసింది. మేము వీటిపై పార్టీ తరఫున నిఘా పెడతామన్నారు.
ఈసీకి ,పోలీసులకు పిర్యాదు చేస్తామని మంత్రి హరీశ్ అన్నారు. ఇప్పుడు రాజగోపాల్ మోటార్లు ఇస్తారు… ఆ తర్వాత బాయి కడ మీటర్లు పెట్టిస్తారు అంటూ ఎద్దేవ చేశారు. మునుగోడు లో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమి లేదని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచాము. అందుకోసం ఓటు వేయమని బీజేపీ అడుగుతుందా? అంటూ ప్రశ్నించారు. మోడీ సర్కార్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడము మొదలుపెట్టిందని అన్నారు. మహిళకు ,మైనార్టీలకు మోడీ హయాంలో రక్షణ లేదని హరీశ్ అన్నారు. చేనేత కార్మికులకు ఉన్న అన్ని పథకాలను మోడీ సర్కార్ తీసివేసిందని.. మోడీ సర్కార్ ఒక్క మంచి పని చేసింది? అని ఎద్దేవ చేశారు. క్షుద్రపూజలు మీకు అలవాటు మాకు కాదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావ్ చురకలంటించారు.
Read also: mulayam singh yadav: ములాయంకు ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం
ఎమ్మెల్యే ఈటల రాజేందర్:
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడి కార్యకర్తలను బీజేపీలో చేరకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అంతేకాకుండా.. మెదక్ జిల్లా అంటే కేసీఆర్ జిల్లా, టీఆర్‌ఎస్ జిల్లా అని అంటారు.. కానీ ఇప్పుడు ఎగిరేది కాషాయ జెండా.. దమ్ముంటే మాతో కొట్లాడండి..కానీ దొంగతనంగా రావద్దు. దుబ్బాక ఎలక్షన్ తో కేసీఆర్ కి, అల్లుడు హరీష్ రావుకి, కొడుకు కేటీఆర్ కి చెంప చెల్లుమన్నది.. హుజురాబాద్ లో నన్ను ఓడించాలని చూశారు.. నన్ను బర్తరఫ్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టారు..
ఆత్మగౌరవంతో పోరాడిన..గెలిచిన.. అసెంబ్లీలో నన్ను ఎదిరించే సత్తా లేక రెండు సార్లు నన్ను బయటికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది కేవలం ఆబ్కారీ శాఖ మాత్రం.. 10 వేలు ఉన్న ఆబ్కారీ ఆదాయాన్ని 45 కోట్లకు పెంచిండు.. ఆడబిడ్డల పుస్తెలు తెంపిన చరిత్ర కేసీఆర్ ది.. పుస్తె కట్టడానికి కళ్యాణాలక్ష్మి ఇస్తున్నావు.. పుస్తె తెంపడనికి వైన్స్ పెట్టింది.. ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రాడు.. మునుగోడు గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే.. కేసీఆర్ అహంకారాన్ని బద్దలుకొట్టి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం. కౌలు రైతులకు కూడా మేం రైతు బంధు సహాయము చేస్తాం.. కేసీఆర్ కంటే 100 రేట్లు గొప్పగా పాలించేది బీజేపీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి:
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మద్దతుగా చౌటుప్పల్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అమ్ముడు పోయిన సన్నాసులకు గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావు ఒక్కొక్కరు ఒక్కో ఊరు పంచుకుంటున్నారని, బీజేపీ వైపు ఢిల్లీ నుంచి పెద్ద పెద్దోళ్ళు దిగిండ్రు.. ఒక్క ఆడపిల్లను ఓడించేందుకు ఇంత మందా? ఢిల్లీ వాడు వచ్చినా.. గజ్వేల్ తాగుబోతులు వచ్చినా మునుగోడు ప్రజల ముందు బలాదూరే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను చంపాలని రాజగోపాల్ రెడ్డి అంటుండని, నిన్ను ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించినందుకా? అని ఆయన ప్రశ్నించారు. నీకు ప్రజల్లో విలువను పెంచినందుకా కాంగ్రెస్ ను చంపాలనుకుంటున్నావ్.. రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎవరు ఏమిచ్చినా తీసుకోండి.. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేసి గెలిపించండని ఆయన అన్నారు.
Heavy Rains in Westgodavari: పశ్చిమగోదావరిని ముంచేస్తున్న భారీ వర్షాలు