బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి .ఎర్రకాలువ నుంచి 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరుకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఏజెన్సీలోని జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా వాసన అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పరిస్థితి దారుణంగా వుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో రహదారులు చిద్రమయ్యాయి.
Read Also: Somu Veerraju: రాజధానిపై భావోద్వేగాలు రెచ్చగొడుతున్న టీడీపీ, వైసీపీ
కొద్ది దూరం ప్రయాణించాలంటే వాహనదారులు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఏలూరు రూరల్ పరిధితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులపై రెండు అడుగుల మేర గోతులు పట్టడంతో వాహనదారులకు నరకం కనిపిస్తుంది. భారీ వర్షాలు నేపథ్యంలో రహదారుల మరమ్మత్తులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి దీంతో గోతులు పడిన రహదారులపై ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాలు ముందుకు కదులుతున్నాయి. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పత్తి, మిరప, పొగాకు పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నాయి వర్షాలు. దీంతో చీరాల రహదారులు జలమయం అయ్యాయి. ఇంకొల్లు మండలం పూసపాడు చప్ట పై పొంగి ప్రవహిస్తున్న కప్పలవాగు.. రాకపోకలకు అంతరాయం కలిగింది. యద్దనపూడిలో ఉదృత్తంగా ప్రవహిస్తున్న పర్చూరు వాగు.. యద్దనపూడి – పోలూరు గ్రామల మద్య రాకపోకలు ఆగిపోయాయి. పంటపోల్లాలో వర్షం నీరు నిలిచిపోవడంతో నష్టం వాటిల్లుతుందని ఆందోళనలో వున్నారు రైతులు.
Read Also: mulayam singh yadav: ములాయంకు ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం