Site icon NTV Telugu

CM KCR: మళ్ళీ వస్తా… ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా

Kcr

Kcr

CM KCR: మళ్ళీ వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలన్నారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలి అన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని తెలిపారు. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు.

Read also: K.A.Paul: నోరు మూయించలేరు.. కొనుగోలు చేయలేరు

దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలన్నారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలన్నారు. సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలన్నారు. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని అన్నారు. మళ్ళీ వస్తానని ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అనంతరం కొండగట్టు నుండి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కి బయల్దేరారు.
CM KCR: కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ.. పాత ఫోటోలు వైరల్

Exit mobile version