NTV Telugu Site icon

Allola Indrakaran Reddy: నాందేడ్ లో సీఎం కేసీఆర్ స‌భ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

Indrakaran Reddy Nanded

Indrakaran Reddy Nanded

Allola Indrakaran Reddy: మహారాష్ట్ర నాందేడ్‌లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పర్యటిన కొనసాగుతుంది. ఈ నెల 5న మ‌హారాష్ట్రలోని నాందేడ్ సీయం కేసీఆర్ పాల్గొన‌నున్ననేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్లను మంత్రి ప‌రిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, విఠ‌ల్ రెడ్డి టీఎస్‌ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు, త‌దిత‌రుల‌తో క‌లిసి శుక్ర‌వారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మ‌హారాష్ట్ర‌లోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు స‌భ‌కు హాజ‌రుకానున్న నేప‌థ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అంద‌రూ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచనలిచ్చారు.

Read also: Telangana Assembly Budget Session Live: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్ డేట్స్

ఇప్పటికే మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ‌న్, ఎమ్మెల్యే జోగు రామ‌న్న, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాల‌మ‌ల్లు, సివిల్ స‌ప్లైస్ కార్పోరేష‌న్ చైర్మన్ ర‌వీంద‌ర్ సింగ్, త‌దిత‌రులు స‌భ ఏర్పాట్లు, నిర్వహ‌ణ‌, పార్టీ విస్త‌ర‌ణ‌పై దృష్టి పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్యటిస్తూ బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను క‌లుస్తూ గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మ‌హారాష్ట్రకు చెందిన‌ స్థానిక ప్రజాప్రతినిదులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. బోక‌ర్ మండలం రాఠీ స‌ర్పంచ్ మ‌ల్లేష్ ప‌టేల్ తో స‌హా 100 మంది మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయ‌కులు బామిని రాజ‌న్న ఆద్వర్యంలో కండువాలు క‌ప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ గా రూపాంత‌రం చెందిన‌ త‌ర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహించ‌నున్న తొలి స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు సంబంధించిన ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామ‌న్నారు. ఎక్క‌డ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. టీఆర్‌ఎస్‌-బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్మల్ జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంతం నాందేడ్ లో స‌భ‌ నిర్వహించడం సంతోషంగా ఉంద‌న్నారు. నాందేడ్ సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్ల‌డించారు. మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పంద‌న వ‌స్తుంద‌ని, నాందేడ్ జిల్లాలో అనేక గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు మ‌హారాష్ట్ర‌లో అమ‌లు చేస్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు వ్యాఖ్యనిస్తున్నార‌ని, బీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌పై కూడా ఎంతో ఆస‌క్తి క‌న‌బరుస్తున్నారని పేర్కొన్నారు.
K.Raghavendra Rao: డిజిటల్ బాట పట్టిన రాఘవేంద్రుడు.. ఆరంభించిన దర్శకధీరుడు

Show comments