Site icon NTV Telugu

Venkaiah Naidu: నేతలు, అధికారుల మధ్య అనైతిక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు..

రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధాల వ్యవహారంలో హాట్‌ కామెంట్లు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం సరికాదని హెచ్చరించిన ఆయన.. పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించే విధంగా సంస్కరణలు ఉండాలన్నారు.. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. విధి నిర్వహణలో ఏమైనా అనుమానాలొస్తే రాజ్యాంగంతో పాటు ఆత్మప్రబోధం మేరకు పనిచేయాలని స్పష్టం చేశారు.

Read Also: Threats to Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రాణ హాని..! పాక్‌ ప్రధాని కీలక ఆదేశాలు

రాజకీయ సిద్ధాంతాలు, ఇతర కోణాల్లో కాకుండా నిజాయితీ, సత్యసంధతలకే కట్టుబడి ఉండాలన్నారు వెంకయ్యనాయుడు.. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం విషయంలో వస్తున్న విమర్శలపైనా ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయ, సిద్ధాంత కోణంలో కాకుండా నైతికత ఆధారంగా లబ్ధిదారులకు మేలు చేయాలని స్పష్టం చేశారు. ఇక, కొన్ని రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఉచితాలను, ఆర్థిక పరిస్థితికి మించిన తాయిలాలు మంచిది కాదని సలహా ఇచ్చారు.. ఇది రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావం చూపుతుందని హెచ్చరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Exit mobile version