Tragedy in Rajendranagar: రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతయ్యాడు. దుర్గాదేవి నిమజ్జనం కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులోపడి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సాగర్ వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ళతో యువకుడి మృతదేహాన్ని బయటకు తీసారు.
Read also: KCR Delhi Visit: బీఆర్‌ఎస్ చీఫ్‌గా తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. విషయం ఇదేనా..?
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంట్లో దుర్గా మాతను శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ప్రతిష్టించారు. ఐదు రోజుల పూజ ఆనంతరం దుర్గా మాతను రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వచ్చిన అన్నదమ్ములు. నిమ్మజనం చేస్తుండగా శ్రీకాంత్ కాళు జారీ చెరువులో పడ్డాడు. అతనిపై విగ్రహం పడడంతో శ్రీకాంత్ నీట మునిగాడు. అన్న కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే నీటి ప్రవాహాన్ని శ్రీకాంత్ ను లోపలికి వెళ్లిపోయాడు. ఈత రాకపోవడంతో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీకాంత్ మృత దేహాన్ని బయటకు తీసారు. శ్రీకాంత్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Flag War : భారత్-పాక్‌ల మధ్య జెండా యుద్ధం.. దేశంలో అతి పెద్దదైన జెండా ఏర్పాటుకు సిద్ధం