Site icon NTV Telugu

ఇళ్ల మధ్యలో బార్‌లు, పబ్‌లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్‌

ఇళ్ళ మధ్యలో పబ్ లు, బార్‌లు ఏర్పాటు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం ఈ పిటీషన్‌ హైకోర్టు విచారించింది. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌లు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్‌ అసోసియేషన్స్‌ సభ్యులు. తదుపరి విచారణ ఈనెల 22కు హైకోర్టు వాయిదా వేసింది.

Read Also: ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కేటీఆర్‌

కాగా ఇప్పటికే ఇళ్ల మధ్యలో పబ్‌లు, బార్‌ల ఏర్పాటుతో ప్రజలకు అసౌకర్యం కలగడమే కాకుండా రాత్రి సమాయాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ కారణంగా వేగంగా వెళ్తు సామాన్యు ప్రాణాలను బలిగొంటున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకోమని పదేపదే చెబుతున్నా మందు బాబులు వినడం లేదు. అంతే కాకుండా రాత్రి సమయాల్లో మత్తులో ఉండటంతో మహిళలపై అనుచిత ప్రవర్తన ప్రదర్శిస్తు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నా ఘటనలు కూడా ఎక్కువే అవుతున్నాయి. జూబ్లీహిల్స్‌ రెసిడెన్షియల్‌ అసోషియేషన్స్‌ సభ్యులు వేసిన పిటీషన్‌ పై కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.

Exit mobile version