NTV Telugu Site icon

Congress First List: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Congress

Congress

Congress First List:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 55 మందికి స్థానం కల్పించారు. బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్‌ ఖాయమైంది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు కూడా టికెట్ దక్కింది.  హుజూర్‌నగర్‌, పద్మ కోదాడ నుంచి ఉత్తమ్‌ బరిలోకి దిగుతున్నారు. వేముల వీరేశం, జూపల్లి కృష్ణారావులకు కూడా తొలి జాబితాలో చోటు దక్కింది. వామపక్షాలతో చర్చించి మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది. తెలంగాణలో 55, మధ్యప్రదేశ్‌లో 144, ఛత్తీస్‌గఢ్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మాజీ సీఎం కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా స్థానం నుంచి పోటీ చేశారు.

ఇదీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..

జగిత్యాల-జీవన్ రెడ్డి
ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం-ఎంఎస్ రాజ్ ఠాకూర్
మంథని-దుద్దిళ్లశ్రీధర్ బాబు
పెద్దపల్లి-విజయరామన్ రావు
వేములవాడ-ఆదిశ్రీనివాస్
మానకొండూర్-కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్-మైనంపల్లి రోహిత్ రావు
అంథోల్-దామోదర రాజనర్సింహ
జహీరాబాద్-ఎ.చంద్రశేఖర్
సంగారెడ్డి-జగ్గారెడ్డి
గజ్వేల్-తూముకుంట నర్సా రెడ్డి

55 మంది అభ్యర్థుల లిస్ట్..