NTV Telugu Site icon

Tragic Incident: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. 17 నెలల బాలుడిని బావిలో తోసేసిన తండ్రి..!

Peddapalli Destrik

Peddapalli Destrik

Tragic Incident: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 17 నెలల కొడుకును బావిలో విసిరి ఆతరువాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి నీటిలో మునిగి చనిపోగా, తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.

రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డికి భార్య మానస, కుమారుడు దేవాన్ష్ (17 నెలలు) ఉన్నారు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కొన్నాళ్లుగా తిరుపతిరెడ్డి సోదరుడు రత్నాకర్ రెడ్డికి మధ్య భూమి విషయంలో వివాదం నడుస్తోంది. భూ సమస్యను పరిష్కరించకుంటే తిరుపతిరెడ్డిని చంపేస్తామని రత్నాకర్ రెడ్డి బంధువులు పలుమార్లు బెదిరించారు. ఈ బెదిరింపుల కారణంగా తిరుపతిరెడ్డి దాదాపు ఏడాది కాలంగా కుటుంబసభ్యులతో కలిసి సుల్తానాబాద్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం (ఆగస్టు 25) వరలక్ష్మి పూజ కోసం భార్య, కొడుకుతో కలిసి స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి సుల్తానాబాద్ చేరుకున్నాడు. శనివారం మరోసారి కొడుకు దేవాన్ష్‌ని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. నేరుగా పొలంలోకి వెళ్లి చిన్నారి దేవాన్ష్‌ను బావిలో పడేశాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రాములపల్లికి వెళ్లిన భర్త, కొడుకు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో మానస తన మామ సంజీవరెడ్డి (తిరుపతిరెడ్డి తండ్రి) సంజీవరెడ్డికి ఫోన్ చేసింది. అయితే తిరుపతిరెడ్డి ఇంటికి రాలేదని సంజీవ రెడ్డి తెలిపారు.

Read also: Tip for Women: మహిళలకు అదిరిపోయే చిట్కా.. ఆ సమయంలో ఈ జ్యూస్ తాగితే..!

మామ సంజీవరెడ్డికి అనుమానం వచ్చి పొలానికి వెళ్లి చూడగా షాక్ తిన్నాడు. తిరుపతిరెడ్డి బావి ఒడ్డున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కంగారుపడిన సంజీవరెడ్డి మనవడి కోసం వెతకగా బావిలో అనుమానాస్పదంగా చూడగా చెప్పులు నీటిపై తేలియాడుతూ ఉండడం గమనించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని తిరుపతిరెడ్డిని సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బావిలోని నీటితో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతిరెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు పోలీసులు రత్నాకర్ రెడ్డి, అతని మామ సత్తిరెడ్డి, బావ లక్ష్మణ్‌లపై కేసు నమోదు చేశారు. చిన్నారి మృతితో పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. భూవివాదంలో చిన్నారి మృతి చెందడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Ram: రజినీ హుకుమ్ సౌంగ్ తో బాలయ్యకి ఎలివేషన్… షేక్ అవుతున్న సోషల్ మీడియా