Site icon NTV Telugu

The father is Cruel to The Son: మద్యానికి డబ్బులివ్వలేదని కుమారుడిపై తండ్రి కర్కశం

The Father Is Cruel To The Son

The Father Is Cruel To The Son

కంటికి రెప్పలే కాపాడుకుంటూ పిల్లల్లి ప్రయోజకుల్ని చేయాల్సిన తండ్రే మద్యానికి బానిసై కుమారుడి పట్ల చిత్రహింసలకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా దేవాపూర్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌ గ్రామానికి చెందిన అబ్బూ తల్లిదండ్రులు మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నారు. తన తల్లిదండ్రును అబ్బూ కుటుంబ పోషణ కోసం నాలుగేళ్లుగా గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

read also: Rajagopal Reddy Live: సమయం కోసం చూస్తున్న రాజగోపాల్ రెడ్డికి..సమయం వచ్చినట్టేనా.! | |Ntv

అయితే.. వానలు కురుస్తుండటంతో.. బయటకు వెల్లలేని పరిస్థతి అయినా కుటుంబంకోసం వానలోనే భిక్షాటనకు బయలు దేరిన ఫలితం లేకపోయింది. ఎవరు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో రెండు రోజులుగా ఇంటికి ఖాలీ చేతులతోనే వెనుతిరిగాడు అబ్బూ బాలుడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి ఎందుకు డబ్బులు తీసుకురాలేదంటూ అబ్బూపై విరుచుకుపడ్డాడు. తనకు మద్యానికి డబ్బులు కావాలని చిత్రహింసకు గురిచేసాడు. బాలుడు తన దగ్గర లేవని కన్నీరు పెట్టుకున్నా చేతులు కట్టేసి ఇంట్లో బంధించాడు. చేతులమీద నూనెను మరిగించి వేడి నూనెను బాలుడి చేతులపై పోసాడు. నొప్పి భరించలేక అబ్బూ కేకలు పెట్టాడు. అదివిన్న స్థానికులు పరుగున ఇంటికి వచ్చి బాలుడిని రక్షించారు. చేతులు కాలి ఏడుస్తున్న బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

East Godavari Telugu Desam Party Politics : ఆ ఉమ్మడి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడుతున్నారా..?

Exit mobile version