NTV Telugu Site icon

The Gun Misfired: గన్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో కానిస్టేబుల్ కు గాయాలు.. చికిత్స పొందుతూ మృతి

The Gun Misfired

The Gun Misfired

The Gun Misfired: కొమురం భీం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కౌటాల పోలీస్టేషన్‌ లో గన్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. కొమురం భీం జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో అందరూ చూస్తుండగానే సెంట్రీ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అధికారులు గమనించి కానిస్టేబుల్ ను హుటాహుటిన కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. అయితే చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందారు. అయితే పోలీస్టేషన్‌ లో గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యిందా లేకా వేరే ఇతర కారణాలు వున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అందరూ పోలీస్టేషన్‌ లోనే వుండగా కానిస్టేబుల్‌ గన్‌ మిస్‌ ఫైర్‌ ఎలా అయ్యిందని? అదే కారణమా ఇంకా ఏదైన వుందా అనేది పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. కానిస్టేబుల్ కుటుంబానికి సమాచారం అందించడంతో పోలీసుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Koti Deepotsavam: కోటి దీపోత్సవం 8వ రోజు హైలైట్స్‌.. శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం