Site icon NTV Telugu

ప్రభుత్వ పథకాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కెసీఆర్ సంక్షేమ పథకాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో అమలవుతున్న పథకాలతో పాటు సమస్యలపై చర్చించారు. పోడు భూముల సమస్య, మెడికల్‌ కాలేజీ నిర్మాణం, దళిత బంధు పథకం అమలు పై కేసీఆర్‌ చర్చించారు.

Read Also: పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థలు మూసివేత

మంత్రులు జగదీష్ రెడ్డి,హరీష్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు.. పల్లా రాజేశ్వర రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటి రెడ్డి, ఎమ్మెల్యే లు కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ,భగత్, రవీంద్ర నాయక్,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రమా రాజేశ్వరి, పలు శాఖల జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాని కన్నా ముందు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు.

Exit mobile version