Site icon NTV Telugu

Singareni Rescue Team: గల్లంతైన ఇద్దరు మృతదేహాలు లభ్యం..

Asifabad

Asifabad

ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం పెసరకుంట పెద్దవాగులో సింగరేణి రెస్క్యూ సభ్యులిద్దరు గల్లంతైన వారి మృతదేమాలు ఈరోజు (గురువారం) తెల్లవారుజామున కనిపెట్టారు. నీటి ఉధృతి తట్టుకోలేక వరద ఎక్కువ కావడంతో గల్లంతైన ఇద్దరు మునిగి మృతి చెందినట్లు అందరూ భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొమురం భీం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో.. నీటి ప్రవాహం ఎక్కువైంది. దహేగాం పెసర కుంట గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది.

Read aslo: Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. మొదటి రౌండ్లో అత్యధిక ఓట్లు

ఈనేపథ్యంలో.. సహాయక చర్యలు చేపట్టేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన సింగరేణి రెస్క్యూటీం బుధవారం దహేగాం మండలం చేరుకుంది. అయితే కురుస్తున్న భారీ వర్షానికి పెసర కుంట గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో రామకృష్ణాపూర్‌ సింగరేణి రెస్క్యూటీం రాము, సతీష్‌ గల్లంతయ్యారు. సింగరేణి రెస్క్యూటీం సభ్యులందరూ మరణించారనే వార్తతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Astrology: జులై 14, గురువారం దినఫలాలు

Exit mobile version