పుట్టిన ప్రతి బిడ్డకు, పిల్లలకు తల్లిపాలు ఒక వరం.. వాటిని మించిన పౌష్టికాహారం బిడ్డకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరుకదు. అలాపాలు ఇవ్వడం ద్వారా అటు తల్లికి, వాటిని తాగడం ద్వారా బిడ్డకు ఆరోగ్యకరమని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి కూడా. అయితే.. ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలే తాగించాలని శాస్త్రవేత్తలు.. డాక్టర్లు చెప్తున్నారు. ఈనేపథ్యంలో.. కొందరు తల్లిదండ్రులు ప్రకటనలు చూసి మోసపోతూ రసాయన మిశ్రమాలతో తయారైన కృత్రిమ పాలు తాగిస్తూ చేజేతులా పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అందుకే తల్లిపాల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందుకు ఏటా ఆగస్టు 1-7 మధ్య ‘తల్లిపాల వారోత్సవాలు’ నిర్వహింస్తుంది. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా..సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహతి ఆడిటోరియంలో 500 మంది తల్లులతో బుక్ ఆఫ్ ఇండియా రికార్డు కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. మొదటి గంట తల్లి పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానమని అన్నారు.
read also:DGP Rajendranath Reddy : ఇద్దరు ఎస్పీల మధ్య.. సిబ్బంది బదిలీల చిచ్చు..!
రోగనిరోధక శక్తి పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుందని పేర్కొన్నారు. డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు మన నినాదం కావాలని తెలిపారు. ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు. తల్లి పాలు అందని కారణంగా మన దేశంలో నిమోనియా, నీళ్ళ విరేచనాలతో ఏటా లక్ష మంది పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నష్టాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉందని, దీనికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం కూడా లేదని పేర్కొన్నారు. బిడ్డకు తల్లి పాలు పడితే చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మా వైద్యులు, ఆశా కార్యకర్తల సహకారంతో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నీలోఫర్ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశామని, ఇది విజయవంతం కావడంతో వరంగల్, ఖమ్మంలోనూ మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు అన్నారు.
Amit Shah and JP Nadda: బీహార్‌లో అమిత్‌షా.. పదేపదే తెలంగాణ ప్రస్తావన..! ఏంటి విషయం..?
