TGSRTC : ఆర్టీసీ ‘గోల్డెన్ ఛాన్స్’.. బస్టాండ్‌లో షాపులు పెట్టుకునే అవకాశం..
- రాష్ట్రవ్యాప్తంగా అద్దెకు 694 ఖాళీ కమర్షియల్ షాపులు
- వ్యాపార విస్తరణకు టీజీఎస్ఆర్టీసీ సువర్ణావకాశం
- వెబ్సైట్లో పూర్తి వివరాలు.. త్వరలో టెండర్లు
- పారదర్శక విధానంతో షాపుల కేటాయింపుకు ఆర్టీసీ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయాణ అనుభూతులతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC), ఇప్పుడు వ్యాపార రంగంలోనూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడమే కాకుండా, సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను (Commercial Complexes) అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ బ్రాండ్లను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది ఒక బంపర్ ఆఫర్‌గా నిలవనుంది.
ప్రజాక్షేత్రంలో వ్యాపార సామ్రాజ్యం
సాధారణంగా ఏ వ్యాపారానికైనా ‘కస్టమర్ల రాక’ (Footfall) అనేది అత్యంత కీలకం. ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్స్‌లు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల, ప్రత్యేకంగా ప్రచార ఖర్చులు లేకుండానే వ్యాపారస్తులకు కస్టమర్లు లభిస్తారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌ల నుండి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ లు అనువైన వేదికలుగా మారనున్నాయి.
Also Read
- BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
- HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
- Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
సారథ్య ఆలోచన… విప్లవాత్మక పారదర్శకత
సంస్థను లాభాల బాట పట్టించడంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నతాశయంతో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, పారదర్శకతకు పెద్దపీట వేసేలా సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార సముదాయాల (Commercial Spaces) వివరాలను యాజమాన్యం అధికారిక వెబ్సైట్లో బహిరంగపరిచింది.
ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, అవి ఖాళీగా ఉన్నాయా లేక నిండిపోయాయా, ప్రస్తుతం ఆ షాప్ లను ఎవరు
నిర్వహిస్తున్నారు, వారి లీజు కాలపరిమితి , అద్దె ఎంత అనే పూర్తి సమాచారాన్ని క్లియర్ కట్‌గా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పెడుతూ, వ్యాపార ప్రకటనలు , అద్దెదారుల ఎంపికలో డిజిటల్ జవాబుదారీతనాన్ని పెంచేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
త్వరలోనే టెండర్లు.. వెబ్సైట్లో పూర్తి వివరాలు
తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల పరిధిలో ఉన్న ఈ ఖాళీ వ్యాపార సముదాయాల వివరాలను సంస్థ అధికారిక వెబ్సైట్ tgsrtc.telangana.gov.in లో పొందుపరచడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. పారదర్శకమైన నిబంధనలు, లీజు పద్ధతుల ద్వారా ఈ స్థలాలను కేటాయించనున్నారు. టీజీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అటు రవాణా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ, ఇటు వ్యాపార రంగానికి సరికొత్త ఊతాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
మీ వ్యాపారాన్ని పెంచుకోండి: ఎండీ వై.నాగిరెడ్డి
ఆర్టీసీ స్థలాల్లో షాప్స్ నిర్వహణ ప్రక్రియను తాము మరింత సరళతరం చేశామని, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి సూచించారు. “టీజీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదావకాశం వ్యాపారులకు ఎంతో లాభదాయకమని, దీనిని సద్వినియోగం చేసుకుని వ్యాపార వృద్ధిని సాధించడమే కాకుండా సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలని” ఆయన ఆకాంక్షించారు. ఈ సువర్ణావకాశాన్ని అందుపుచ్చుకుని వ్యాపారంలో రాణించాలని సంస్థ వర్గాలు కోరుతున్నాయి.
తాజావార్తలు
-
Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
-
BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
-
Nitish Setu Controversy: ‘నితీశ్ సేతు’పై రాజకీయ రగడ.. ప్రధాని మోడీ వెళ్లగానే ఆర్జేడీ కార్యకర్తల హంగామా
-
Vrushakarma: ‘వృషకర్మ’ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ.. ట్రైలర్ ఎప్పుడంటే?
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
ట్రెండింగ్
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!