Site icon NTV Telugu

Group -2 : గ్రూప్-2 ఫలితాలు విడుదల

Tgpsc

Tgpsc

Group -2 : టీఎస్‌పీఎస్సీ (Telangana State Public Service Commission) గ్రూప్‌-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం వివరాలు వెల్లడించారు. మొత్తం 783 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కాగా, 782 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని ఆయన తెలిపారు. “పరీక్షలు నిర్వహించిన 10 నెలల్లోనే ఫలితాలను ప్రకటించగలిగాం. గ్రూప్‌-1 సంబంధిత సమస్యలు ఎదురుకాలేకపోతే ఇంకా ముందుగానే ఫలితాలను విడుదల చేసేవాళ్లం” అని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.

Ram Charan: ఏంటి తమన్ …. OG కోసం చేతులపై కిరోసిన్ పోసుకుని వాయించావా?

గ్రూప్‌-2 కోసం 5 లక్షల 51 వేల మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షలకు హాజరైన వారిలో 2 లక్షల 36 వేల మంది క్వాలిఫై అయ్యారని చైర్మన్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి 11న GRL (General Ranking List) ప్రకటించి, అనంతరం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2022లోనే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలైంది. దాదాపు మూడు సంవత్సరాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ఎదురు చూపులకు ముగింపు లభించింది.

Maharastra: మహారాష్ట్రలో భయంకర రోడ్డు ప్రమాదం, పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై విషాదం

Exit mobile version