Site icon NTV Telugu

TGPSC: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్

Tgpsc

Tgpsc

తెలంగణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ 1,2,3 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రిజల్స్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారికి టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1,2,3 పరీక్షల ఫలితాల విడుదల తేదీలను ఫిక్స్ చేసింది. ఈరోజు జరిగిన సమావేశంలో టీజీపీఎస్సీ కమిషన్ పెండింగ్ లో ఉన్న అనేక నోటిఫికేషన్ల స్టేటస్ పై సమీక్షించి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్/ ఫలితాల ప్రకటన కోసం షెడ్యూల్ ను ఆమోదించింది.

Also Read:GHMC: నగరవాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త.. వాటిపై భారీ డిస్కౌంట్

టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్ 1 ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. అభ్యర్థికి వచ్చిన ప్రొవిషనల్ మార్కుల వివరాలను ప్రకటించనున్నారు. మార్చి 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించనున్నారు. మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించనున్నారు. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలను ప్రకటించనుంది. మార్చి 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ రిజల్ట్స్ ను విడుదల చేయనున్నది.

Exit mobile version