Site icon NTV Telugu

Housing Board : తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో భూముల వేలం.. ఎప్పుడంటే.?

Ts Gov Logo

Ts Gov Logo

Housing Board : తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఈ నెల 6 నుండి 20 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 ప్లాట్ల వేలాన్ని నిర్వహించనుంది. గత నెలలో ఈ వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వేలం మేడ్చల్, KPHB, నాంపల్లి, నిజామాబాద్, గద్వాల, సదాశివపేట, రావిర్యాల వంటి ప్రాంతాల్లో జరుగుతుంది. వేలంలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి.

Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు

ప్రతి ప్లాట్‌కు ప్రత్యేకంగా రిజర్వ్ ప్రైస్ నిర్ణయించబడింది. తగిన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత MSTC పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా వేలం జరగనుంది. హౌసింగ్ బోర్డు అంచనా ప్రకారం, ఈ భూముల వేలం ద్వారా సుమారు 200 నుండి 300 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావొచ్చు. ఈ విధంగా రాష్ట్రానికి అదనపు రాబడి వచ్చినట్టే, పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉంది. TGHB ప్లాట్ల వేలం ద్వారా జనరేటెడ్ రెవెన్యూని వివిధ సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త హౌసింగ్, రోడ్డులు, పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు వంటి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని అధికారులు తెలిపారు.

Tamil Nadu Politics: విజయ్‌ని కలిసిన బీజేపీ..! కాషాయ పార్టీ భారీ వ్యూహం ఫలిస్తుందా..?

Exit mobile version