Hyderabad Central University: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సేంట్రల్ యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కామన్ ఎంట్రన్స్ టేస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన విద్యార్థులను యునివర్సిటీ సేక్యురిటీ సిబ్బంది బలవంతంగా ఖాళీ చేయించారు.
ఆసమయంలో.. విద్యార్థులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాటలో విద్యార్థులకు. ఈతోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలుయ్యాయి. సుమారు 1,57, 000 మంది విద్యార్థులు నుంచి 600 రుపాయలు అధికంగా వసూలు చేశారని యునివర్సిటీ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. అధికంగా ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. అధిక వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసారు. దీంతో హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఆందోళన ముసుగులో ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తోపులాటలో గాయాలైన విద్యార్థులకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bigg boss 6: మూడో కెప్టెన్ గా బిగ్ బాస్ రివ్యూవర్!
