Tension in Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడిగూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తిమ్మారెడ్డిగూడెంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన కళాకారులు జై భీమ్ అంటూ నినాదాలతో తిమ్మారెడ్డిగూడెం మారుమోగింది. కాగా అటునుంచి వెలుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అక్కడున్న కళాకారుల దగ్గరకు వెళ్లి జై భీమ్ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంతంగా సాగుతున్న సభను అడ్డుకోవడం ఏంటని ఇది సరైన పద్దతి కాదని ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డిని మునగాల ఎస్సై లోకేష్ చెప్పారు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలకొంది.కాగా.. అక్కడ పరిస్థితి చేయదాటడంతో పోలీసులు ఇరువుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
Read also: Jess Jonassen: బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్
అయితే ఎస్సై లోకేష్ తనపై దాడి చేశాడంటూ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా శ్రీనివాస్ రెడ్డి వర్గం ఆందోళన చేపట్టింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఎంపీటీసీపై పోలీసులు దాడిచేయడం ఏంటి? అని ప్రశ్నించారు. నేను ఏ సభను అడ్డుకోలేదని పోలీసులే కావాలనే తనపై దాడి చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభ నిర్వహించారని, అక్కడి నుంచి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, తనను ఎస్సై లోకేష్ అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నిస్తే మాపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే… అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాన్వాయ్ ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సీఐ జోక్యంతో అక్కడ నుంచి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెళ్లిపోయారు. అయితే.. తాను ఎవరిపై దాడి చేయలేదని మునగాల ఎస్సై లోకేష్ వివరణ ఇచ్చారు. సభను అడ్డుకోవడంతోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
Kedar Jadhav : ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్..
