NTV Telugu Site icon

Negligence Doctors: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. వైద్యపరీక్షలు చేయకుండా ఆపరేషన్‌

Nagarkarnool Crime

Nagarkarnool Crime

Negligence Doctors: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఆరుగురు బాలింతలకు అస్వస్థత గురయ్యారైన ఘటన మరువకముందే.. నాగర్‌ కర్నూలు జిల్లా ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండా ఓ బాలింత ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతుంది. దీంతో తెలంగాణలో ఆసుపత్రులకు వెళ్లాలంటే బాలింతకు భయాందోళనకు గురవుతున్నారు.

Read also: Payal Rajput: టవల్‌ చుట్టుకుని సెల్ఫీ ఏంటమ్మా.. పొట్టి నిక్కర్‌తో..

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన పి.మహేష్ ఆర్.సి.ఐ.లో కార్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బరీస్ సిరి వెన్నెల రెండవ కాన్పు డెలివరీ కోసం సోమవారం నాడు మలక్ పేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమెకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే.. ఆపరేషన్ అనంతరం ఆమెకు తీవ్ర రక్త స్రావం, బీపీ పడి పోవడం, ఈసీజీలో మార్పులు రావడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో.. అక్కడి నుంచి బయలుదేరి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగు ఫీవర్ ఉందని దీనివల్ల ఫ్లేట్ లెట్స్ పడిపోవడం జరిగిందని తెలిపారు.

Read also: Nandakumar Released: జైలు నుంచి విడుదలైన నందకుమార్‌.. షరతులతో కూడిన బెయిల్

అయినా ఇలాంటి సమయంలో ఆపరేషన్ చేయొద్దుకదా ఎలా చేయించారని కుటుంబ సభ్యులకు ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఆపరేషన్ చేయడంతోనే మృతి చెందినదని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. షాక్‌ కు గురైనా కుటుంబ సభ్యులు.. మృతురాలి భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని ఆరోపిస్తూ.. మాకు న్యాయం చేసి, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో ఆసుపత్రిలో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులను నమ్మి వచ్చి ప్రాణాలు గుప్పొట్లో పట్టుకుని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాన్నరు. ఇప్పటి కైనా అధికారులు ఇలాంటి ఆసుపత్రులపై దృష్టి సారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read also: Fit Ness Gym: జిమ్‌లో మైనర్‌ బాలికపై వేధింపులు.. శరీర భాగాలు తాకుతూ..

ఇక రెండురోజుల ముందు (జనవరి 11న) జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఆరుగురు బాలింతలకు అస్వస్థత గురైన విషయం తెలిసిందే. సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ తో బాలింతలు అవస్థలు ఎదుర్కొన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని బందువులు వాపోతున్నారు. బాలింతలనే కనికరం లేకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సిజేరియన్‌ చేసిన ఇన్షెక్షన్‌ అయ్యిందని దానివల్లే బాలింతలు నరకయాతన పడుతున్నారని వాపోయారు. ఇలా ఒకరు, ఇద్దరు కాదని ఆరుగురు గర్భణీలకు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాతా శిశు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు ఉన్నా వైద్యులు నిర్లక్ష్యం మాత్రం అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎవరు లేరని అందుకే వైద్య సిబ్బంది తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందని అవస్థకు గురవుతున్న గర్భణీకుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం స్పందన ఎలా ఉండనుందనేది ఉత్కంఠంగా మారింది.
Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు