MP Aravind Kumar: నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు జ్వాలలు చెలరేగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులు నిరసనలతో తెలంగాణ రాష్ట్రంలో నీట్ హీట్ పెరిగింది. నిరసనలతో ఏకంగా బీజేపీ నేతల ఇళ్లవద్ద నిరసనలు చేపట్టారు విద్యార్థి సంఘాలు. నీట్ రద్దు చేయాలని నిరసనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ధర్నాలు, నిరసనలు చేపట్టామని తెలిపారు. నీట్ రద్దు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆపాయింట్ మెంట్ కోరిన స్పందించడంలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి నీట్ నిరసన జ్వాలలు చేరేంత వరకు ఆగేది లేదని విద్యార్థులు పేర్కొన్నారు.
Read also: Osmania Hospital: నిన్న నల్ల దుస్తులు.. నేడు కళ్ళకు గంతలు.. ఉస్మానియాలో జూడాలు నిరసన..
నీట్ రద్దు చేయకపోతే విద్యార్థులు రోడ్డున పడతామని వాపోతున్నారు. ఈనేపథ్యలో ఇవాళ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడికి దిగాయి. నీట్ లీకేజీపై తెలిపేందుకు విద్యార్థులు అపాయింట్ కోరుతున్న నేతలు స్పందించక పోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఇళ్ల ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో ఇటు హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి ఇంటికి, అటు నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ ఇంటికి నీట్ విద్యార్థులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ నివాసాన్ని NSUI సహా వామపక్ష విద్యార్థి నాయకులు ముట్టడించారు. విద్యార్థులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు విద్యార్దులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Challa Harishankar: జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్ కీలక వ్యాఖ్యలు