NTV Telugu Site icon

ఎమ్మెల్సీ ఎన్నికలు.. పెద్దపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా పోలింగ్‌ కేంద్రంలో స్వల్వ ఉద్రిక్తత నెలకొంది… పెద్దపల్లి జిల్లా బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్‌కి టీఆర్ఎస్‌ ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ప్రజాప్రతినిధులు వరుసక్రమంలో ఉండగా.. ఇద సమయంలో ఓదెల మండలం కొలనూరు బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్‌కు, టీఆర్ఎస్ ఎంపీటీసీ ఓటర్లకు మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు గమనించి శ్రీనివాసుని నచ్చజెప్పి బయటకు తీసుకెళ్లారు..

కాగా, తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.. ఇటీవ‌లే ఎన్నికల కమిషన్‌ 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌‌ జారీ చేయగా.. వాటిలో రంగారెడ్డి, మహబూబ్‌‌ నగర్‌‌ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాల‌ చొప్పున, అలాగే, నిజామాబాద్‌‌, వరంగల్‌లో ఒక్కో సీటు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. దీంతో నేడు కరీంనగర్‌‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్‌‌, మెదక్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో సీటుకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.