Site icon NTV Telugu

Khairatabad Ganesh: ఉద్రిక్తత.. రాజాసింగ్ కు మద్దతుగా బీజేపీ కార్య కర్తలు నిరసన

Rajasingh

Rajasingh

Khairatabad Ganesh: వినాయక ఉత్సవాల మొదటి రోజే, హైదరాబాద్ నగరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా బీజేపీ కార్య కర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు, రాజాసింగ్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసేకుంది, నిరసనకారులను అరెస్టు చేసి, రాంగోపాల్ పేట్ ఠాణాకు తరలించారు. ఇవాళ ఖైరతాబాద్ వద్ద గణేశుడు కొలువుదీరడంతో.. ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తొలి పూజలు చేశారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మహాగణనాథునికి మహాహారతి ఇచ్చారు. ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా బడా గణేశుని దర్శించుకొని పూజలు చేశారు. గణేషుడ్ని పూజించుకునేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం చర్చనీయాంశమైంది.
Harish Rao: రెండు రోజుల నుండి చూస్తున్న.. వాళ్ళు ఈరోజు వచ్చి నాటకాలా?

Exit mobile version