Site icon NTV Telugu

Bhatti Vikramarka : రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేయాలి.. అదే జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుంది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహార్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అతిథిగా పాల్గొనగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సాగర్ కాలువల నుంచి నీరు పొందాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మధిర నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని ఏరు దాటుతున్నా, ఆ నీరు వృథా అవుతోంది. ఉద్యమాల సమయంలో ఇది చేయలేకపోయాం, కానీ పదేళ్ల TRS పాలనలో ఒక్క చుక్క నీటినీ సద్వినియోగం చేయలేదన్నారు.

Mahavatar : ఇంట్లో కూర్చొని 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయొచ్చు – దర్శకుడు అశ్విన్ కుమార్

ఉమ్మడి రాష్ట్ర కాలంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, ముఖ్యంగా జలిముడి ప్రాజెక్ట్ పట్ల BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆయన విమర్శించారు. దయలేని BRS పాలన తర్వాత, ఇంద్రమ్మ రాజ్యం రాగానే ఈ పథకానికి మోక్షం లభించింది. మూడో జోన్‌లో 35 వేల ఎకరాలకు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదం చేస్తుంది అని భట్టి విక్రమార్క తెలిపారు.

అంతేకాకుండా.. సాగర్ మూడో జోన్ మొత్తం రెండో జోన్‌లో కలిసేలా రూపకల్పన చేస్తున్నాం. ఖమ్మం జిల్లా మొత్తం సాగర్ నీటిపైనే ఆధారపడి ఉంది. మనం కేవలం 1 TMC కృష్ణా నీటిని వాడుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ వారు 11 TMCల నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

బనకచర్ల ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోరాడి ఆ ప్రాజెక్ట్‌ను ఆపారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ, దానిని ఆపేందుకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ముంపు భూములను తెలంగాణకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్ట్‌ను అంగీకరించబోం. యావత్ కేబినెట్‌ బనకచర్ల వ్యతిరేక పోరాటంలో ముందుంటుంది అని స్పష్టం చేశారు.

జవహార్ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే, మధిర నియోజకవర్గ రైతులకు సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని, పంటల ఉత్పాదకత పెరిగి ఆర్థికంగా రైతులు లాభపడతారని తెలిపారు.

MLC Kavitha: కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే..

Exit mobile version