NTV Telugu Site icon

BRS Vs BJP: బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ

Bandi Sanjay Kavitha

Bandi Sanjay Kavitha

Bandi sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ సభలో కవితను విమర్శిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై బీఆర్‌ఎస్ మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయకుంటే ముద్దులు పెడతారా అంటూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మాటలకు నిరసనగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బండి తీరుపై ఎంపీ మాలోతు కవిత మండిపడ్డారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు. కవితకు క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బండి సంజయ్ కి నోటీసులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటో గా తీసుకొని వీడీజీపీ ని విచారణకు మహిళా కమిషన్ ఆదేశించింది. బండి సంజయ్ వ్యతిగతంగా హజరు కావాలి మహిళా కమిషన్ నిర్ణయించింది.

మంత్రి సత్యవతి రాథోడ్..

రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే మాట్లాడే గవర్నర్, కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్లపై స్పందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గవర్నర్ ఉద్దేశం ఏంటో చెప్పాలని అన్నారు. కాగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసుల మోహరించారు. కార్యాలయానికి వచ్చే రెండు దారుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు. బీ అర్ ఎస్ ఆందోళనల నేపథ్యంలో ముందస్తు భద్రతా పెంచారు పోలిసులు.

హైదరాబాద్‌ లోని వనస్థలిపురం ఏసీపీకి రెడ్కో చైర్మన్ ఫిర్యాదు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై bjp రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రెడ్కో చైర్మన్. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నదని ధ్వజమెత్తారు. కవితను అవమానించిన అవమానించిన బండి సంజయ్ ని అరెస్ట్ చేసిచట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు మహిళల హక్కుల కోసం పోరాడుతున్న కవితపై బిజెపి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ సర్కారు దురుద్దేశపూర్వకంగా మహిళాబిల్లును తొక్కిపెట్టిందన్నారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అడిగినందుకు కేసులతో వేధిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కానీ అవగాహన లేని బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. బిజెపి అధినాయకత్వం కుట్ర పూరితంగా కవితపై కేసు పెట్టినా పారిపోకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారని తెలిపారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బిజెపి బ్రోకర్లు, వారి వెనకాల ఉన్న బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. కానీ కవిత మాత్రం ఏ తప్పు చేయకున్నా ధీరవనితలు రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో పోరాడుతున్నారని అన్నారు. అలాంటి వీర వనిత గురించి నీచంగా మాట్లాడిన బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

పంజాగుట్ట చౌరస్తాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆందోళన..

ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆద్వర్యంలో పంజాగుట్ట చౌరస్తా లో అందోళనలు మిన్నంటాయి. బిఆరెస్ కార్యకర్తలు బీజేపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ని మోడీ రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నాడని మండిపడ్డారు. బండి సంజయ్ మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు. కావాలనే మోడీ కవితపై కేసులు పెట్టిస్తున్నాడన్నారు. ఈడీ, సీబీఐ లను మోడీ వాడుకుంటున్నాడని ఆరోపించారు. కవిత జోలికి వస్తే తెలంగాణ అట్టుడికి పోతుందని బీజేపీ లీడర్స్ ని హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు.

ఇక సిద్దిపేట జిల్లా ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ మహిళ నాయకులు ఫిర్యాదు చేసారు. బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.
Revanth Reddy: ఈడీ తలచుకుంటే.. కవితని గంటలోపే జైలుకి పంపొచ్చు

Show comments