Site icon NTV Telugu

తెలంగాణ వాతావరణ సూచన…

నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు ఒడిస్సా,పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతములో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక ప్రదేశములలో రేపు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి.

వాతావరణ హెచ్చరికలు :

ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షములు మరియు రేపు భారీ వర్షములు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అతి భారీ వర్షాలు మరియు అత్యంత భారీ వర్షములు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నవి.* రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షములు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి.

Exit mobile version