NTV Telugu Site icon

Telangana Weather Update: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు

Telangana Weather

Telangana Weather

Telangana Weather Update: తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ మూడు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా. ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం.. ఇవాళ ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Minister Niranjan Reddy: వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పా..?

రాగల 3 రోజులకు వాతావరణ సూచనల విషయానికి వస్తే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది