Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత, మితిమీరిన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో.. ప్రకృతి కాస్త చల్లని కబురు మోసుకొచ్చింది. ఆకాశంలో అకస్మాత్తుగా మారుతున్న వాతావరణం ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశించినప్పటికీ.. అది తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన ప్రమాదకర హెచ్చరికగా మారింది. వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం.. రాబోయే కొన్ని గంటలు రాష్ట్రంలోని పలు జిల్లాలకు కీలకం కానున్నాయి. ఎండల నుంచి ఉపశమనం లభించినా, వడగళ్ల వాన రూపంలో పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వడగళ్ల వాన బీభత్సం
తెలంగాణ వాతావరణ శాఖ (IMD) తాజా బులిటెన్ ప్రకారం.. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ప్రధానంగా హెచ్చరించారు. ముఖ్యంగా మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల , కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం తీవ్రంగా ఉండనుంది.
Also Read
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు భారీ వేగంతో వీచే గాలులు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మేఘాలు క్రమంగా కదులుతూ కామారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు విస్తరించనున్నాయి. వడగళ్ల వాన వల్ల పంట నష్టంతో పాటు, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. పాత భవనాలు, రేకుల షెడ్లలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..