NTV Telugu Site icon

Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..

Telangana Vc Ravinder Gupta

Telangana Vc Ravinder Gupta

Telangana VC Ravinder Gupta Stucks in Another Dispute in Nizamabad: నిజామాబాద్‌ జిల్లా లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న గణేష్ నిమజ్జనం తర్వాత, గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. అంతేకాదు గర్ల్స్‌ పై వీసీ డబ్బులు ఎగురవేస్తూ, డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు సమాచారం. దీంతో వీసీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసే రవీందర్ గుప్తా.. రెండు రోజుల క్రితం ఓ మహిళా ప్రొఫెసర్ ను దుర్భాషలాడి మరో వివాదానికి తెర తీశారు.

ఎదో ఒక వివాదంతో.. తెలంగాణ యూనివర్సిటీ కేరాఫ్​ అడ్రస్ గా మారింది.. కొత్త వీసీ వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీలో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. కాగా.. ఏడు నెలల కింద నియమించిన రిజిస్ట్రార్ ను తొలగించడంతో.. మరోసారి ఆ వర్సిటీ వార్తల్లోకి వెక్కింది.. అనేక ఆరోపణలు వస్తున్నా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అప్పట్లో విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో నిరుడు మే 22న యూనివర్సిటీలకు సర్కారు వైస్​ ఛాన్సర్లను నియమించింది. ఈనేపథ్యంలో.. భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రవీంద్రకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.. ఏండ్లుగా ఇన్ చార్జి పాలనలో మగ్గిన తెలంగాణ వర్సిటీకి మంచిరోజులొచ్చాయని ఆశించిన ప్రొఫెసర్లు, స్టూడెంట్లకు నిరాశే మిగిలింది. అయితే.. వీసీ వచ్చినప్పటి నుంచి ఏదోఒక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా వీసీ చుట్టే తిరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. అంతేకాకుండా.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియమాకం నుంచి రిజిస్ట్రార్ల తొలగింపు వరకూ ఏదో వివాదం జరుగుతూనే ఉంది. దీంతో.. వర్సిటీ అభివృద్ధిపై కాక వసూళ్లపైనే వీసీ దృష్టి పెట్టారనే ఆరోపణలూ వస్తున్నాయి. వీసీ తీరుపై ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో వేచి చూడాలి.

అయితే.. తెలంగాణా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. బాలికల వసతి గృహం ఎదుట విద్యార్థుల ధర్నా నిర్వహించారు. బాలికల వసతి గృహంలో వీసీ డాన్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేవారు. వీసీ దిష్టిబొమ్మను స్టూడెంట్స్ దగ్ధం చేసారు. వీసీని రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు.

Show comments