NTV Telugu Site icon

విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు వ్యాక్సిన్‌.. గైడ్‌లైన్స్‌ విడుదల

vaccination

వ్యాక్సిన్‌ నేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ప్రాధాన్యత ప్రకారం వ్యాక్సినేషన్‌ చేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్‌ ఇస్తుండగా.. ఇప్పుడు విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లేవారికి వ్యాక్సిన్‌పై గైడ్‌లైన్స్ విడుదల చేశారు.. ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది ఆరోగ్య శాఖ.. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లేవారు పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ వీసాలను చూపించి ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా పొందవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.. అర్హులైన వారికి కోవిషీల్డ్‌ టీకాలను 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది సర్కారు… అంతేకాదు.. విదేశాలకు వెళ్లే ఉద్యోగస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 టీకా కేంద్రాలను కేటాయించింది వైద్య ఆరోగ్య శాఖ.