Site icon NTV Telugu

TG TET 2025 : తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Tgtet 2025

Tgtet 2025

TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గురువారం ఈ ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు నవంబర్ 29గా నిర్ణయించారు.

జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో 2025 ఏడాదికి సంబంధించిన తొలి విడత టెట్ నోటిఫికేషన్‌ను జూన్‌లో విడుదల చేయగా, పరీక్షలు పూర్తి చేసి జూలై 22న ఫలితాలను ప్రకటించారు.

ఇప్పుడు రెండో విడత టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాల్సిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కొనసాగించాలంటే తప్పనిసరిగా ఈ టెట్ పరీక్షను ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

TPCC Mahesh Goud : త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌజ్

Exit mobile version