ఇవాళ తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. నేడు ఉదయం 11:30 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. అయితే.. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈనేపథ్యంలో.. టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అయితే.. ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. కాగా.. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరుకాగా.. జూన్ 28 ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.