NTV Telugu Site icon

Sun will be high: రాష్ట్రంలో ఎక్కువగా ఎండ తీవ్రత.. 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం

Sun Will Be High

Sun Will Be High

Sun will be high: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తడి వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే ఎండలతో పాటు వడగళ్ల వాన కూడా కురుస్తోంది. దీంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన వాంకుతోడు సునీత శుక్రవారం వడదెబ్బతో మృతి చెందిన విషయం తెలిసిందే. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం అత్యధికంగా నల్గొండలో 42.5 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్పంగా హయత్‌నగర్‌లో 25.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైంది.

నిన్న హైదరాబాద్‌లో గరిష్టంగా 37.2, కనిష్టంగా 27.9, ఖమ్మంలో 41.4, కనిష్టంగా 29.0, మెదక్‌లో 40.6, కనిష్టంగా 24.0, నల్గొండలో 42.5, కనిష్టంగా 24.4, నిజామాబాద్‌లో 40.4, కనిష్టంగా 29.0 డిగ్రీలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 41.6, కనిష్టంగా 28.0, హనుమకొండలో 39.0, అత్యల్పంగా 27.5, దుండిగల్‌లో 38.2, అత్యల్పంగా 27.6, హకీంపేటలో 35.2, కనిష్టంగా 26.1, భద్రాచలంలో 39.0, కనిష్టంగా 28.09, ఆదిలాబాద్‌లో 28.09, కనిష్టంగా 2.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. అయితే ఇటీవల కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఎండలు మండుతుండగా.. 29 నుంచి 31 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వనపర్తి, వనపర్తిలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Bridegroom escape: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కొడుకు ఉహించని ట్విస్ట్