NTV Telugu Site icon

Holidays: పాఠశాలలకు సెలవులు పెంపు.. కానీ.. మీరు అనుకునేది కాదండోయ్..

Holidyes

Holidyes

Holidays: జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూన్ 12, 2024 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. పాఠశాలలు తెరిచే సమయం ఆసన్నమైనందున, సెలవులను పెంచాలనే కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో మార్పులు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సెలవులు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తోంది. అయితే ఇది వేసవి సెలవుల గురించి కాదు.. పండుగలకు ప్రకటించిన సెలవుల గురించి.

Read also: Hyderabad Power Cut: నేడు నగరంలో పవర్‌ కట్‌.. ప్రాంతాల వారీగా షెడ్యూల్..

ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్‌ క్యాలెండర్‌లో పండుగలకు ఇచ్చే సెలవుల్లో సైన్స్‌ లేదని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అభిప్రాయపడింది. తొలి ఏకాదశి పండుగకు సెలవు ఇవ్వాలని సూచించింది. దీపావళి పండుగకు కూడా రెండు రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా మహాశివరాత్రి మరుసటి రోజు కూడా సెలవు ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అకడమిక్ క్యాలెండర్‌లో మార్పులు చేయాలని కోరారు. వారి అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే పాఠశాలలకు సెలవులు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో 1-10వ తరగతికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం, తెలంగాణలో పాఠశాలలు జూన్ 12, 2024న పునఃప్రారంభించబడతాయి.

Read also: IndiGo flight: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపులు..

అలాగే ఏప్రిల్ 24, 2025న ముగుస్తుంది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పనిచేస్తాయి. అదేవిధంగా వచ్చే ఏడాది వేసవి సెలవులను కూడా ఈ అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 24, 2025 నుండి జూన్ 11, 2025 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. దసరా సెలవులు 2024 అక్టోబర్ 2-14 నుండి దాదాపు 13 రోజుల పాటు కొనసాగుతాయి. 2025 సంక్రాంతి సెలవులు జనవరి 13-17 నుండి మొత్తం 5 రోజులు ఉంటాయి. అలాగే 2024లో 27 సాధారణ సెలవులు మరియు 25 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. జనవరి 15న సంక్రాంతి సెలవులు, మార్చి 8న మహాశివరాత్రి, మార్చి 25న హోలీ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళి హాలీడేస్ ఇస్తున్నారు.
Rashmika Mandanna: రష్మిక ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా.. మీరు అనుకున్నదే!