Site icon NTV Telugu

Dinesh Chowdary: కేసీఆర్ ని కించపరిచేవారిపై చర్యలు తీసుకోవాలి

Trs Social Media

Trs Social Media

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోషల్ మీడియా లో సీఎం కేసీఆర్ ని కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు తెలంగాణ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ దినేష్ చౌదరి. తెలంగాణ లో బిజెపి అల్లర్లకు కుట్ర చేస్తుంది.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయంలో ఫిర్యాదు చేశారు టి ఆర్ ఎస్ సోషల్ మీడియా విభాగం నిర్వాహకులు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియలో, ఫేస్ బుక్ లో కించపరిచే పోస్టింగ్ లు పెట్టి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఫేస్ బుక్ వేదికగా కించపరిచే పోస్టింగ్ లు వస్తున్నాయన్నారు. బీజేపీ దీని వెనక ఉండి ఇలాంటి సోషల్ మీడియా పేజీలు నడిపిస్తుందని దినేష్ చౌదరి ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారు.

తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకు ఈ తరహా చర్యలు చేపడుతున్నారు. బీజేపీ దేశంలో అస్థిరత, అల్లకల్లోలాలను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సమాజం వాటిని తిప్పికొడుతుందన్నారు. ఈ తరహా చర్యలు బీజేపీ నేతలు మానుకోవాలని దినేష్ చౌదరి సూచించారు.

Read Also: Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్.. రూ.10 కోట్లు తీసుకున్న రాజమౌళి..?

Exit mobile version