Site icon NTV Telugu

No Fly Zone : తెలంగాణ సెక్రటేరియట్ ఇక ‘నో-ఫ్లై జోన్’

Telangana Secretariat

Telangana Secretariat

No Fly Zone : తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఇకపై ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం పైన లేదా దాని చుట్టుపక్కల డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా నిర్మించిన సచివాలయం రాష్ట్ర పరిపాలనా కేంద్రం కావడం, ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచుగా ఉండే కారణంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం భద్రతకు డ్రోన్‌ల ద్వారా ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు నివేదించాయి. ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు డ్రోన్లను ఉపయోగించి సచివాలయంపై నిఘా పెట్టడం లేదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని నివేదికలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Pakistan: అరేయ్ మునీర్, మీరు మారరా.? భారత్, హిందుత్వపై విషం కక్కిన పాక్ ఆర్మీ..

నో-ఫ్లై జోన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ బోర్డులపై “ఇది నో-ఫ్లై జోన్. డ్రోన్లు నిషేధం” అని స్పష్టంగా హెచ్చరికలు ముద్రించి ఉంటాయని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డ్రోన్‌ల చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయంతో సచివాలయం భద్రత మరింత పటిష్టంగా మారుతుందని అధికారులు తెలిపారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Exit mobile version