ప్రత్యక్ష తరగతులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్నాయి.. అయితే, పాఠశాల స్థాయిలో ప్రత్యక్ష బోధనకు స్కూళ్లను, విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని పేర్కొంది.. కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇక, ఎవరికన్న కోవిడ్ నిర్ధారణ అయితే వారితో కాంటాక్ట్ ఉన్న వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించింది పాఠశాల విద్యాశాఖ.. విద్యార్థులు ఇంటి వద్ద ఉండి చదువుకుంటామంటే అనుమతి ఇవ్వాలని పేర్కొంది. స్కూల్స్ కి హాజరు కావాలని ఒత్తిడి చేయకూడదన్న సర్కార్.. మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కోవిడ్ బారినపడి మరణించిన వారి పిల్లలను ఏ కారణం చేత కూడా ప్రైవేట్ పాఠశాలల నుండి తీసివేయకూడదు అని ఆదేశాలు జారీ చేసింది పాఠశాల విద్యాశాఖ. కాగా, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది.. కానీ, ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం తరగతులు ఆన్లైన్లో నిర్వహించాలా? ప్రత్యక్షంగానా? అనేది ఆయా విద్యాసంస్థలు, విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్టు గతంలోనే స్పష్టం చేసింది సర్కార్.. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను కోర్టు ఆదేశాల మేరకు మరికొంత కాలం మూసి ఉంచుతున్నట్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సమాంతరంగా ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు ఏ విధానంలోనైనా తరగతులకు హాజరుకావొచ్చు అని గతంలోనే తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!