Site icon NTV Telugu

Sajjanar: రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవడమే పొరపాటు.. సజ్జనార్ ట్వీట్ వైరల్..

Sajjanar

Sajjanar

Sajjanar: కొన్నిసార్లు తప్పు లేకపోయినా ఎదుటివారు తప్పులకు బలవతారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవడమే వారి పొరపాటు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సజ్జనార్ ప్రమాద వీడియోను పోస్ట్ చేశారు. చాలా రోడ్డు ప్రమాదాలకు మద్యపానం, అతివేగం ప్రధాన కారణాలు. కొందరి నిర్లక్ష్యం చాలా మంది జీవితాల్లో అంధకారం నింపుతోంది. ఎవరి తప్పిదానికి అమాయకులు బలవుతున్నారు. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. కుటుంబాలను నిరాశకు గురిచేయొద్దు’ అంటూ ప్రమాద వీడియోతో పాటు వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Read also: Man Killed Mother in law: భార్యను కొడుతుండగా అడ్డు వచ్చిన అత్త.. పొడిచి చంపిన అల్లుడు

ముగ్గురు బైక్ రైడర్లు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుండగా మితిమీరిన వేగంతో వెనుక నుంచి కారు దూసుకుపోతోంది. సిగ్నల్ వద్ద ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఆగి ఉన్న బైక్‌లను ఢీకొట్టింది. దీంతో రెండు బైక్‌లను ముందుకు ఎగురవేయగా, మరో బైక్ అక్కడే పడిపోయింది. ప్రమాద దృశ్యాలు సిగ్నల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బైక్‌ నడిపేవారి తప్పు లేకపోయినా కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి కారణమైంది. సజ్జనార్ ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. మద్యం తాగి లేదా అతివేగంగా వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రాణాలను తీయడమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని సజ్జనార్ అన్నారు.


iPhone 13 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 21 వేలకే ఐఫోన్ 13! డోంట్ మిస్ ది ఛాన్స్

Exit mobile version