Telangana RERA : తెలంగాణ రెరా కీలక ఆదేశాలు.. పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కొరడా
- ఐదు ప్రాజెక్టులపై కీలక ఆదేశాలు
- 38 మంది సభ్యులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్
- కొనుగోలుదారులకు వడ్డీతో నగదు వాపస్
- ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొనుగోలుదారుల హక్కులను కాలరాస్తున్న, నిబంధనలు ఉల్లగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా పలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది.
మాగ్నస్ ఎలైట్ హోమ్స్, ఎలైట్ బీహెచ్ఐఎల్ సొసైటీ
ఎలైట్ బీహెచ్ఐఎల్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి చెందిన 38 మంది సభ్యులకు కేటాయించిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ రెరా స్పష్టం చేసింది. సభ్యులు ఉత్తర్వులు అందుకున్న 30 రోజుల్లోగా మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని, ఆ తర్వాత 15 రోజుల్లోగా ప్రమోటర్ తనఖాలను తొలగించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ కేటాయించిన ప్లాట్లు అందుబాటులో లేకపోతే 30 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని, అది కూడా సాధ్యం కాకపోతే వడ్డీతో కూడిన నగదును తిరిగి చెల్లించాలని తేల్చిచెప్పింది.
Also Read
- ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..
- Kishan Reddy : పేద విద్యార్థుల భవితకు భరోసా.. 4,741 మంది టెన్త్ విద్యార్థులకు ఫీజు చెల్లించిన కిషన్ రెడ్డి
- Telangana Darshini: తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్..
- స్నాప్‌చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!
శ్రీ టవర్స్ (గాజులరామారం)
గాజులరామారంలోని శ్రీ టవర్స్ ప్రాజెక్టులో ఫిర్యాదుదారులకు సెల్లార్లో రెండు కార్ పార్కింగ్ స్థలాలను 30 రోజుల్లోగా కేటాయించి అప్పగించాలని శ్రీ బిల్డర్స్‌ను రెరా ఆదేశించింది. పార్కింగ్ కోసం ఇప్పటికే డబ్బులు వసూలు చేసినందున ఆ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రమోటర్‌పై ఉందని, రెండు స్థలాలు ఇచ్చేందుకు బిల్డర్ అంగీకరించినందున నగదు వాపసు ప్రస్తావన లేదని స్పష్టం చేసింది.
జస్విత ఎస్టేట్స్ (శంకర్పల్లి)
శంకర్‌పల్లిలోని జస్విత ఎస్టేట్స్ ప్రాజెక్టులో ప్లాట్ కొనుగోలుదారుకు రూ.47 లక్షలను 10.85% వార్షిక వడ్డీతో సహా 60 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని శాండ్ స్టోన్ ఇన్ఫ్రా సంస్థను ఆదేశించింది. 2019లో డబ్బులు వసూలు చేసినా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పాటు, నగదు వాపసు కోసం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని రెరా గుర్తించింది. చెల్లని చెక్కులు జారీ చేసినంత మాత్రాన నగదు వాపసు చేసినట్లు కాదని స్పష్టం చేసింది.
సిగ్నేచర్ టవర్స్ (తూంకుంట)
తూంకుంటలోని సిగ్నేచర్ టవర్స్ ప్రాజెక్టులో ఫ్లాట్ బుకింగ్ కోసం వసూలు చేసిన రూ.9 లక్షలను 60 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆశ్రితాస్ గ్రూపును రెరా ఆదేశించింది. అయితే కొనుగోలుదారు వ్యక్తిగత కారణాల వల్ల బుకింగ్ రద్దు చేసుకున్నందున వడ్డీని నిరాకరించింది. మూడు విడతల్లో నగదు చెల్లిస్తామన్న హామీని ప్రమోటర్ నిలబెట్టుకోలేదని, ఫ్లాట్ అమ్ముడైన తర్వాతే డబ్బులు ఇస్తామన్న వాదనను అథారిటీ తోసిపుచ్చింది.
గూగీ శాటిలైట్ టౌన్షిప్ (నోముల)
నోములలోని గూగీ శాటిలైట్ టౌన్షిప్ ప్రాజెక్టులో కొనుగోలుదారుకు మిగిలిన రూ.18.80 లక్షలను 10.85% వార్షిక వడ్డీతో 60 రోజుల్లోగా చెల్లించాలని గూగీ ప్రాపర్టీస్‌ను ఆదేశించింది. గతంలో చెల్లించిన రూ.5 లక్షల మొత్తానికి కూడా నిర్దేశిత కాలానికి వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టినందుకు ఇప్పటికే జరిమానా విధించామని, ఈ ఆదేశాలు పాటించకపోతే సెక్షన్ 63 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Telangana RERA : తెలంగాణ రెరా కీలక ఆదేశాలు.. పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కొరడా
-
Gold Purity Test: మీ నగలు అసలైనవేనా? మార్కెట్లో ‘చైనా పౌడర్’ కల్తీ కలకలం.. ఈ టెస్టులతో సింపుల్‌గా పట్టేయండి!
-
Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
-
ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..
-
Bilawal Bhutto: ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు?.. పాక్ రాజకీయాల్లో భుట్టో కలకలం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..