NTV Telugu Site icon

Harish Rao: ఆస్పత్రుల నిర్వహణలో రాష్ట్రానికి మూడో స్థానం..

ఆస్పత్రుల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌ క్యాంప్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.. ఇక, మెదక్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజీలు వస్తాయని వెల్లడించారు హరీష్‌రావు.. త్వరలో పటాన్‌చెరులో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే 15 రోజుల పాటు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని… ఈ క్యాంపులను వినియోగించుకొని ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు మంత్రి హరీష్‌రావు.

Read Also: Supreme Court: లఖింపూర్ ఖేరీ కేసు.. వారంలో లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు