Telangana Rain: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. దట్టమైన మేఘాలు లేకపోవడంతో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు లేకపోయినా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంగర్, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి.
Read also: Health Tips :రోజూ పరగడుపున ఒక లవంగాన్ని తింటే..ఎన్నో లాభాలో తెలుసా?
మరోవైపు ఏపీలోని కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్న మూడు రోజుల్లో గుంటూరు, బాపట్ల, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Viral Video: ఓరి దేవుడో అక్కో.. కాటేస్తే పరిస్థితి ఏంటి?